ఎంతో కాలంగా నా పేరుతో నకిలీ కారు స్టిక్కర్ ను ఉపయోగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఎంపీ స్టిక్కర్ పేరుతో బెదిరింపులు, మోసాలకు పాల్పడుతున్నారని తన సోదరుడిపై ఆరోపణలు గుప్పించారు ఎంపీ కేశినేని నాని
తెలుగు దేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది.. పార్టీలోని విభేదాలు, ఎన్నికల్లో పోటీ విషయం ఇలా ఎన్నో సందర్భాల్లో అలకలు, బుజ్జగింపులుగా సాగుతూ వస్తోంది.. ఇప్పుడు కేశినేని ఫ్యామిలీలో చిచ్చు మొదలైంది.. టీడీపీ సీనియర్ నేత, ఎంపీ కేశినేని నాని తన సోదరుడైన కేశినేని చిన్నిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చగా మారింది.. తన పేరు, హోదాను అడ్డుపెట్టుకుని గుర్తు తెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని, నకిలీ వీఐపీ…