స్వర్గీయ శ్రీ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తెల్లవారుఝామునే ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాతకి నివాళులు అర్పించారు. నందమూరి బాలకృష్ణ కొద్దిసేపటి క్రితమే వెళ్లి తండ్రికి పూలమాలతో నివాళి అర్పించారు. ఈ సంధర్భంగా మీడియాతో బాలయ్య మాట్లాడాడు. “ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మహిళలకు స్వేచ్చను, ఆర్ధిక స్వాతంత్య్రాన్ని కలిగించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన వ్యక్తి అని, తెలంగాణాలోనూ పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేశారని తెలిపారు. పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం, గురుకులాలు వంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్దికి ఎన్టీఆర్ కృషి చేశారని” అని బాలయ్య చెప్పుకొచ్చాడు.
Read Also: Devara: అనిరుధ్ కారణంగానే దేవర డిలే?