కేరళ రాష్ట్రంలోని కోజీకోడ్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్లపై ఎవరు కనిపిస్తే వారిని కరిచేస్తున్నాయి. నిన్న (ఆదివారం) ఈ కుక్కల గుంపు కనిపించిన వారిపై కనిపించినట్లుగా దాడి చేశాయి. దీంతో ఈ కుక్కలను అధికారులు అదుపులోకి తీసుకురాలేకపోయారు. దీంతో ఇవాళ (సోమవారం) ఆ ఏరియాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కుక్కల భయానికి కోజీకోడ్‌లోని కూతలి పంచాయత్ పరిధిలోని ఏడు పాఠశాలలు, 17 అంగన్వాడీలకూ నేడు సెలవు ఇచ్చారు.