NTV Telugu Site icon

Arvind Kejriwal: “బీజేపీ నన్ను చంపేందుకు ప్రయత్నించింది”.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

Arvind Kejriwal

Arvind Kejriwal

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఢిల్లీలోని జహంగీర్‌పురిలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నిన్న నేను ఢిల్లీలోని వికాస్‌పురికి వెళ్లానని, అక్కడ బీజేపీ.. గూండాలను పంపి నన్ను చంపేందుకు ప్రయత్నించింది. నాపై దాడి చేశారు. మీకు ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయండి. నన్ను జైలుకు పంపి నా పని అక్కడే ఖతం చేయాలని చూశారు. గత 75 ఏళ్లలో ఏ పార్టీ, ఏ నాయకుడు చేయని పనిని నేను గత పదేళ్లులో నేను చేశాను. నిజాయితీతో పని చేస్తున్నాను. 2014లో 7-8 గంటలపాటు కరెంటు కోతలు ఉండేవి. కానీ ఇప్పుడు కరెంటు కోత లేదు. 22 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఏ రాష్ట్రంలోనూ 24 గంటల కరెంటు లేదు. ఉచిత రేవూరి పంపిణీ చేస్తున్నారని బీజేపీ వాళ్లు నన్ను దుర్భాషలాడుతున్నారు. బీజేపీ తప్పుడు కేసులో నన్ను జైలుకు పంపింది. మళ్లీ నన్ను సీఎం చేయండి.” అని పేర్కొన్నారు.

READ MORE: Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

ఇదిలా ఉండగా… ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై శుక్రవారం దాడికి ప్రయత్నించారు. కేజ్రీవాల్‌ పాదయాత్ర చేస్తున్న సమయంలో వికాస్‌పురిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘కొందరు బీజేపీ గూండాలు తమపై దాడికి ప్రయత్నించారు’ అని ఆప్ చెబుతోంది. ‘బీజేపీ గూండాలు కేజ్రీవాల్ దగ్గరికి వచ్చారని, పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని’ ఆప్ ఆరోపించింది. ఈ ఘటనను పార్టీ సీరియస్‌గా తీసుకుని పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సోషల్ మీడియా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. ఈడీ, సీబీఐ, జైలుతో కేజ్రీవాల్‌ను అణిచివేయాలని ప్రయత్నించగా.. ఫలించలేదని.. దీంతో బీజేపీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ జీపై దాడికి యత్నించిందని ఆరోపించారు. కేజ్రీవాల్‌కి ఏదైనా జరిగితే దానికి నేరుగా బీజేపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

READ MORE: Love Couple Suicide: కదులుతున్న రైలు నుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య