నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘రివాల్వర్ రీటా’ . ఇటివల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. జే.కే చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక వైవిధ్యమైన పాత్రల్లో కనిపించగా.. రాధిక శరత్ కుమార్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ‘మహారాజ’ వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన ప్యాషన్ స్టూడియోస్ నిర్మించింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం డిసెంబర్ 26, 2025 నుండి స్ట్రీమింగ్ కానుంది. కేవలం తమిళం, తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ మూవీ అందుబాటులోకి రానుండటం విశేషం. థియేటర్లలో మిస్ అయిన వారికి ఇది పక్కా క్రిస్మస్ ట్రీట్ అని చెప్పవచ్చు.