NTV Telugu Site icon

KCR: లోక్‌సభ ఎన్నికలపై కేసీఆర్ కసరత్తు.. నేతలతో ఏం చర్చించారంటే..!

Kcr

Kcr

పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కేడర్ బలహీనపడింది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనైనా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయా పార్లమెంట్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ఎన్నికల మూడ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కార్యకర్తలను చైతన్య పరిచారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం చేయాలని శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

Ingenuity: అంగారకుడిపై నాసా “హెలికాప్టర్” ఇక పనిచేయదు.. పలుచటి వాతావరణంలో అద్భుతం సృ‌ష్టించింది..

తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా రంగంలోకి దిగారు. గత కొంత కాలంగా తుంటి మార్పిడితో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటు దేశంలో చోటుచేసుకున్న రాజకీయాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ తెలుసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ఎలాగైనా మెజార్టీ సీట్లలో విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. గజ్వేల్‌లోని ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై నేతలతో మేథోమదనం చేశారు. ఈ సందర్భంగా నేతలకు కేసీఆర్ పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేటీఆర్ కూడా హాజరయ్యారు.

Darshan: హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరో… భార్య సంచలనం?

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని ప్రతిపక్షంలో కూర్చుంది. ఊహించని ఓటమితో ఆ పార్టీ నేతలంతా షాక్‌కు గురయ్యారు. ఇప్పుడిప్పుడే ఈ వాతావరణం నుంచి బయటకు వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపే ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తోంది. ఇక ప్రతిపక్ష పార్టీ విమర్శలను అధికార పక్షంగా కూడా అంతే ధీటుగా తిప్పికొడుతోంది. మరీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు గెలుచుకుంటారో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.