KCR: లోక్‌సభ ఎన్నికలపై కేసీఆర్ కసరత్తు.. నేతలతో ఏం చర్చించారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కేడర్ బలహీనపడింది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనైనా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయా పార్లమెంట్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ఎన్నికల మూడ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కార్యకర్తలను చైతన్య పరిచారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం చేయాలని శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
Ingenuity: అంగారకుడిపై నాసా “హెలికాప్టర్” ఇక పనిచేయదు.. పలుచటి వాతావరణంలో అద్భుతం సృష్టించింది..
Also Read
తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా రంగంలోకి దిగారు. గత కొంత కాలంగా తుంటి మార్పిడితో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటు దేశంలో చోటుచేసుకున్న రాజకీయాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ తెలుసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ఎలాగైనా మెజార్టీ సీట్లలో విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. గజ్వేల్‌లోని ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై నేతలతో మేథోమదనం చేశారు. ఈ సందర్భంగా నేతలకు కేసీఆర్ పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేటీఆర్ కూడా హాజరయ్యారు.
Darshan: హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరో… భార్య సంచలనం?
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని ప్రతిపక్షంలో కూర్చుంది. ఊహించని ఓటమితో ఆ పార్టీ నేతలంతా షాక్‌కు గురయ్యారు. ఇప్పుడిప్పుడే ఈ వాతావరణం నుంచి బయటకు వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపే ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తోంది. ఇక ప్రతిపక్ష పార్టీ విమర్శలను అధికార పక్షంగా కూడా అంతే ధీటుగా తిప్పికొడుతోంది. మరీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు గెలుచుకుంటారో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?