రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం. నంది నగర్ నివాసం నుంచి అసెంబ్లీ సమావేశాలకు రానున్నట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి నంది నగర్ కు కేసీఆర్ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటి సారి గవర్నర్ ప్రసంగానికి , రెండవ సారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ కి వచ్చారు.
Also Read:Sigachi Blast: సిగాచి పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్..
కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రోజుల క్రితం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికార పక్ష్యం ప్రతి విమర్శలు గుప్పించింది. అప్పటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.