తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్ మంత్రులు, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం జరిగింది. ఈ సందర్భంగా రోడ్ల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు సక్రమంగా చేపట్టడం, పనుల్లో నాణ్యత పెంచేందుకు రోడ్లు భవనాల శాఖలో చేపట్టాల్సిన నియామకాలు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి పైన, రోడ్లను ఎప్పటికీ చెక్కు చెదరకుండా అద్దాల మాదిరిగా ఉంచేందుకు చేపట్టవలసిన చర్యలు, పాడయిన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయడం, పనుల నాణ్యత పెంచే దిశగా రోడ్లు భవనాలు శాఖలో చేపట్టాల్సిన నియామకాలు తదితర కార్యాచరణపై సీఎం సమీక్షించారు.
Also Read : Fake Certificate : ఇక ఫేక్ సర్టిఫికెట్లకు చెక్.. పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకార్ రావు, శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ సమీక్ష అనంతరం నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు సీఎం కేసీఆర్. నూతన సచివాలయాన్ని వచ్చే సంక్రాంతికి ప్రారంభించే యోచనలో రాష్ట్ర సర్కార్ ఉంది. ఈ క్రమంలో సచివాలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.
Also Read : Elon Musk: ఉద్యోగులనే కాదు.. ఒంట్లో కొవ్వునూ వదలట్లేదు.. ఏకంగా 13కేజీలు తగ్గిన మస్క్