కేటుగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్న నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తూ ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో ఉన్నత విద్యలు చదివినట్లు బోగస్ సర్టిఫికెట్లను పుట్టిస్తున్నారు. ఆయా యూనివర్సిటీల్లోని కొందరు డబ్బుకు ఆశపడి ఈ నకిలీ సర్టిఫికెట్ల బాగోతానికి సహకరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రోజూ వెలుగులో వస్తున్నాయి. అయితే.. తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్ల బెడదకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ పూనుకుంది. ఈ క్రమంలో నకిలీ సర్టిఫికెట్ల తనిఖీకి పోర్ట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వివిధ రాష్ట్రాల యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్లు పొందినట్లు ధృవీకరణ పత్రాలు సృష్టించి డబ్బు దండుకుంటున్నారు మోసగాళ్లు.
Also Read : Sajjala Ramakrishna: ఎవరైనా చంద్రబాబు భార్యని అవమానిస్తే.. ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి?
అయితే.. ఇటీవల కాలంలో ఈ నకిలీ సర్టిఫికెట్ల తంతు పెరుగుతూ వస్తోంది. దీంతో ఈ నకిలీ సర్టిఫికెట్లకు చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది ఉన్నత విద్యామండలి. ఈ క్రమంలోనే.. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించి గత పన్నెండేళ్లలో సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులు వివరాలను ఈ పోర్టల్ లో నిక్షిప్తం చేసినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. అయితే.. రాష్ట్రంలో బోగస్ సర్టిఫికెట్లను గుర్తించడానికి ఏర్పాటు చేసిన పోర్టల్‌ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ప్రారంభించనున్నారు.