Site icon NTV Telugu

KCR: పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

Kcr

Kcr

ఎర్రవెల్లి ఫాంహౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీటింగ్ ముగిసింది. ఈ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేక్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణా రావు, ప్రకాష్ గౌడ్, అరికేపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితులపై వారితో చర్చించారు. ఈ క్రమంలో.. గులాబీ దళపతి కేసీఆర్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: IND vs ENG : వ‌ర్షం ప‌డి సెమీస్ మ్యాచ్‌ ర‌ద్దైతే..? టీమిండియా నేరుగా..

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయం అని కేసీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపుల పై సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఉందని.. పార్టీ కూడా ఆ ఎమ్మెల్యేల పై అనర్హత వేటు కోసం న్యాయ పోరాటం చేస్తుందని తెలిపారు. మరో ఆరు నెలలు ఆగుదాం.. ఆ తర్వాత ప్రభుత్వం చేసే తప్పుల పై ప్రజల్లోకి వెళదామని ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోండని.. వారికి అన్ని విధాలుగా అండగా నిలవండని తెలిపారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇబ్బంది పడుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.

Read Also: Prabhas : ప్రభాస్ కు ఇంకా ఆ గాయం తగ్గలేదా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

Exit mobile version