Etela Rajender : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. గులాబీ పార్టీలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటల మాట్లాడుతూ, కేసీఆర్ ఒకరిపై నెగటివ్ అభిప్రాయం పెంచుకుంటే ఇక ఆయనను ఒప్పించటం అసాధ్యమని అన్నారు. కవిత విషయంలోనూ ఇదే జరిగింది అని భావిస్తున్నట్లు తెలిపారు. “కేసీఆర్ తనకు తాను చక్రవర్తిలా భావిస్తారు. ఆయనను ఎవరు ప్రశ్నించకూడదు, విమర్శించకూడదు. ఆయన మాటే శాసనం,” అని ఈటల వ్యాఖ్యానించారు.
LOVE : డెలివరీ రూమ్ బయట భర్త ఎమోషనల్ ఎక్స్ప్రెషన్.. వీడియో చూస్తే మీకూ కంటతడి ఆగదు..!
20 ఏళ్ల పాటు కేసీఆర్‌తో పనిచేసిన అనుభవంతో మాట్లాడుతూ, “అయన పక్కన ఉండటం అంటే పూర్తిగా ఆయన్ని అనుసరించాల్సిందే. ఆయన్ను విమర్శించినవారిని ఆయన సహించరు. అతని పాలన రాచరికపు ధోరణిలో సాగుతుంది,” అని ఆరోపించారు. కేసీఆర్ నమ్మినవారినే అవసరమైనప్పుడు వాడుకుని తరువాత వదిలేస్తారని, ఇదే ఆయన రాజకీయం కుదించడానికి కారణమైందన్నారు. కవిత విషయంలో కుటుంబంలో ఏదో తేడా వచ్చి ఉండొచ్చని, మళ్లీ కలవడానికి అవకాశం లేదని ఈటల స్పష్టం చేశారు.
ఈటల తనను కేసీఆర్ ఎందుకు దూరం చేసుకున్నారన్న అంశంపై మాట్లాడుతూ, “ఎవరో చెప్పిన మాటలపై నమ్మకంతోనే ఆయన నన్ను పక్కన పెట్టారు. ఇదే విధంగా హరీశ్ రావుతోనూ 2016 నుంచే ఇబ్బందులు నడుస్తున్నాయి,” అన్నారు. హరీశ్ రావు బీజేపీతో టచ్‌లో ఉన్నారని వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, “అయన మాతో టచ్‌లో లేరు” అని స్పష్టం చేశారు.