Alasanda Vadalu: హోటల్ స్టైల్‌లో కరకరలాడే వడలు.. ఇంట్లోనే సులభంగా ఇలా ట్రై చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alasanda Vadalu: సాయంత్రం వేళ వేడివేడిగా, కారంగా ఏదైనా తినాలనిపిస్తే అందరికీ గుర్తొచ్చేది వడలు. ముఖ్యంగా అలసంద వడలు వాటి రుచి, క్రిస్పీనెస్‌కి ఎవరినైనా ఫిదా కావాల్సిందే. అయితే చాలామందికి వడలు చేసేటప్పుడు నూనె ఎక్కువగా పీల్చుకోవడం లేదా మెత్తగా అయిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అస్సలు నూనె పీల్చకుండా, పైన క్రిస్పీగా.. లోపల గుల్లగా ఉండేలా అలసంద వడలు ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Vijay – Rashmika: పాపం.. పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోనివర్రా..
Also Read
- సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
కావలసిన పదార్థాలు:
* అలసందలు (బొబ్బర్లు) – 1 కప్పు
* మినపగుళ్లు – 1 టేబుల్ స్పూన్ (జిగురు, క్రిస్పీనెస్ కోసం)
* పచ్చిమిర్చి – 4 నుంచి 5
* అల్లం – 1 ఇంచు ముక్క
* జీలకర్ర – 1 టీస్పూన్
* ధనియాలు – 1 టీస్పూన్
* ఉల్లిపాయ తరుగు – అర కప్పు
* కొత్తిమీర, కరివేపాకు – తగినంత
* ఉప్పు – రుచికి సరిపడా
* నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం..
ముందుగా ఒక కప్పు అలసందలకు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్లు కలిపి, శుభ్రంగా కడిగి రాత్రంతా లేదా కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. ఇలా మినపగుళ్లు వేయడం వల్ల వడలకు మంచి బైండింగ్ రావడమే కాకుండా, నూనె పీల్చకుండా కరకరలాడుతూ వస్తాయి. మిక్సీ జార్‌లో ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ ధనియాలు వేసి కొంచెం కోర్సుగా (బరకగా) గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత అందులోనే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మళ్లీ ఒకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టిన అలసందలను నీళ్లు లేకుండా పూర్తిగా వడకట్టాలి. మిక్సీ జార్‌లో ఈ అలసందలు, మినపగుళ్లు, సరిపడా ఉప్పు వేసి అస్సలు నీళ్లు పోయకుండా బరకగా గ్రైండ్ చేయాలి. పిండిని మరీ మెత్తగా చేస్తే వడలు ముద్దగా వస్తాయి, కాబట్టి బరకగా ఉండేలా చూసుకోవాలి.
రుబ్బిన పిండిలో ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, కరివేపాకు మరియు ముందుగా సిద్ధం చేసిన పచ్చిమిర్చి మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, కొద్దిగా పిండిని తీసుకుని వడల్లా ఒత్తుకుని నూనెలో వేయాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో వేయిస్తే లోపల పచ్చిగా ఉండిపోతుంది, కాబట్టి మీడియం ఫ్లేమ్ మాత్రమే వాడాలి. వడలు క్రిస్పీగా రావడానికి మినపగుళ్లు కీలకం. పిండి రుబ్బేటప్పుడు అస్సలు నీళ్లు వాడకూడదు. ఇది వడలు నూనె పీల్చకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఈ వడలను అల్లం చట్నీ, పల్లి చట్నీ లేదా నాన్-వెజ్ గ్రేవీ కర్రీలతో తింటే రుచి మామూలుగా ఉండదు. కుదిరితే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి.
READ ALSO: Abhishek Sharma: అభిషేక్ శర్మ.. ఏమైంది బాస్? పసికూనపై కూడా పత్తా లేవు!
తాజావార్తలు
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!