KCR : పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా..? కేసీఆర్ సావాలి అంటున్నారు.. నేను సావను..
- తెలంగాణలో గతంలో భయంకర పరిస్థితులు ఉండేవి
- తెలంగాణ పదం అసెంబ్లీలో మాట్లాడవద్దని రూలింగ్ ఇచ్చారు..
- మిషన్ భగీరథ ఎందుకు కుంటుతుంది... లాగులు పగిలేలా కొట్టాలి
- కేసీఆర్ సావాలి అంటున్నారు.. నేను సావను..
- పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా..? : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల వేదికగా జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన మరణం కోరుకుంటున్న వారికి తనదైన శైలిలో సమాధానమిస్తూనే, రాష్ట్రంలో ప్రస్తుత పాలనలోని వైఫల్యాలను ఎండగట్టారు. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. “ఒకప్పుడు అసెంబ్లీలో తెలంగాణ అనే పదం వాడటానికే వీల్లేకుండా రూలింగ్ ఇచ్చేవారు. బషీర్ బాగ్ కాల్పుల్లో రైతులు చనిపోయినప్పుడు భరించలేక పార్టీ పెట్టి బయలుదేరాను. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చావు నోట్లోకి వెళ్లి రాష్ట్రాన్ని సాధించాను” అని కేసీఆర్ భావోద్వేగంగా మాట్లాడారు. ఇప్పుడు కొందరు కేసీఆర్ చావాలని కోరుకుంటున్నారని, కానీ పిల్లి శాపాలకు ఉట్లు తెగవని, తాను ఇప్పుడప్పుడే చావనని స్పష్టం చేశారు.
KCR: బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా జీవన్‌రెడ్డి.. ప్రకటించిన కేసీఆర్
Also Read
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
- CM Revanth Reddy: "ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యత".. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు..
- High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
- Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. “మేము అధికారంలో ఉన్నప్పుడు కరెంటు సక్కగా ఉండేది. ఇప్పుడు కరెంటుకు ఏ రోగం వచ్చింది? ఏమైనా కాకి ఎత్తుకపోయిందా?” అని ప్రశ్నించారు. 20 వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్న రాష్ట్రాన్ని ఈ ‘దరిద్రుల’ చేతిలో పెడితే.. నేడు ప్రజలు చీకట్లో మగ్గుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తాను హెచ్చరించినట్లే జరుగుతోందని కేసీఆర్ అన్నారు. “వీళ్లు గెలిస్తే దళిత బంధుకి జైభీమ్, రైతుబంధుకి రాం రాం అని చెబుతారని ముందే చెప్పాను.
CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
ఇప్పుడు అదే జరుగుతోంది. రైతుబంధు డబ్బులు నెలల తరబడి వేస్తారా? రైతుల కష్టాలు వీళ్లకు పట్టడం లేదు” అని మండిపడ్డారు. ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చే మిషన్ భగీరథ పథకాన్ని ఎందుకు కుంటుపడేలా చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజలకు నీళ్లు ఇవ్వడంలో విఫలమైతే.. “లాగులు పగిలేలా కొట్టాలి” అంటూ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ ఉన్నంత వరకు ప్రజల పక్షాన పోరాటం ఆగదని, కాంగ్రెస్ వైఫల్యాలను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
-
CM Revanth Reddy: “ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యత”.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు..
-
Virat Kohli: కోహ్లీ విమర్శలను పట్టించుకోడనేది అబద్దం.. సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Srinivasa Mangapuram : ఘట్టమనేని వారసుడు జయకృష్ణపై భారీ అంచనాలు.. డాన్స్ అదరగొడుతున్నాడుగా
-
Udhayanidhi Stalin: అధికారం పోయినా మారని తీరు! సనాతన ధర్మంపై మరోసారి విషం చిమ్మిన ఉదయనిధి స్టాలిన్
ట్రెండింగ్
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..