GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ఆర్థిక వ్యవస్థ జోరును చాటుతూ.. సరుకులు, సేవల పన్ను (GST) వసూళ్లు సరికొత్త రికార్డులను సృష్టించాయి. అంతర్జాతీయంగా మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయని ఏప్రిల్ నెల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది కంటే మెరుగైన వృద్ధిని నమోదు చేస్తూ జీఎస్టీ వసూళ్లు చరిత్రలోనే గరిష్ట స్థాయికి చేరాయి.
రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..
Also Read
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
- Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2026 నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 2.43 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన రూ. 2.23 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 8.7 శాతం వృద్ధి. రిఫండ్లను తీసివేసిన తర్వాత, నికర జీఎస్టీ వసూళ్లు రూ. 2.11 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 7.3 శాతం ఎక్కువ. దిగుమతుల ద్వారా వచ్చే రాబడి ఈసారి వసూళ్లకు ప్రధాన ఇంజన్‌గా నిలిచింది. దిగుమతులపై జీఎస్టీ ఏకంగా 25.8 శాతం పెరిగి రూ. 57,580 కోట్లకు చేరింది.
దేశీయంగా జరిగిన లావాదేవీల ద్వారా వసూళ్లు 4.3 శాతం వృద్ధి చెంది రూ. 1.85 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను స్థూల జీఎస్టీ రాబడి 8.3 శాతం పెరిగి రూ. 22.27 లక్షల కోట్లకు చేరుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక , గుజరాత్ వంటి రాష్ట్రాలు ఎప్పటిలాగే జీఎస్టీ వసూళ్లలో సింహభాగాన్ని అందించాయి. రిఫండ్ల చెల్లింపులు కూడా ఈసారి 19.3 శాతం పెరగడం గమనార్హం. మార్చి నెలలో కూడా రూ. 2 లక్షల కోట్ల మార్కును దాటిన వసూళ్లు, ఏప్రిల్‌లో మరింత పెరగడం భారత ఆర్థిక రంగ స్థిరత్వానికి నిదర్శనం.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!