NTV Telugu Site icon

KCR: కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల

Kcr

Kcr

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ విజయవంతంగా ముగిసింది. యశోదా హాస్పిటల్ లో కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. నాలుగు గంటలకు పైగా కేసీఆర్ కు డాక్టర్లు సర్జరీ చేశారు. యశోద డాక్టర్ల ఆధ్వర్యంలో కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసింది. ఈ క్రమంలో.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోదా హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Read Also: Article 370: ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాశ్మీర్‌ భద్రతపై అధికారుల సమీక్ష..

ఈరోజు మధ్యాహ్నం విడుదల చేసిన అప్‌డేట్‌తో పాటు.. కేసీఆర్ ఎడమ టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ పూర్తి అయ్యిందని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్సను తమ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లు, అనస్థీషియాలజిస్టులు మరియు నర్సుల బృందం నిర్వహించిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కేసీఆర్ శస్త్రచికిత్సకు బాగా సహకరించారు.. హిప్ రీప్లేస్మెంట్ ప్రక్రియ మొత్తం స్థిరంగా ఉన్నారని పేర్కొన్నారు. చంద్రశేఖర్ రావు శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసి ప్రస్తుతం తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు.. ఐవి ఫ్లూయిడ్స్… యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ మందులతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. రేపు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఫిజియథెరపీ అండ్ డైట్ రూపొందిస్తామని అన్నారు. రికవరీకి సాధారణంగా ఆరు నుండి ఎనిమిది వారాల వరకు ఉంటుందని భావిస్తున్నట్లు …
యశోద ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.