మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ ముగిసింది. యశోదా హాస్పిటల్ లో కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. నాలుగు గంటలకు పైగా కేసీఆర్ కు డాక్టర్లు సర్జరీ చేశారు. యశోద డాక్టర్ల ఆధ్వర్యంలో కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసింది .ఈ క్రమంలో.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మరికాసేపట్లో యశోదా హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేయనుంది.