Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- కాంగ్రెస్‌లో శశి థరూర్ వ్యాఖ్యల కలకలం..
- రాహుల్ కార్యక్రమానికి, సీజేపీకి వచ్చిన మద్దతు రాలేదని కామెంట్స్..
- బీజేపీని సంతృప్తిపరిచే వ్యాఖ్యలు వద్దని కేసీ వేణుగోపాల్ హితవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో మరోసారి వివాదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడే వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో శశి థరూర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నిర్వహించిన ‘‘ఛాత్రోం కీ గూంజ్’’ కార్యక్రమానికి, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి వచ్చినంత స్పందన రాలేదని, కాంగ్రెస్ దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
థరూర్ చేసిన వ్యాఖ్యలపై వేణుగోపాల్ స్పందిస్తూ.. తాను ఈ వ్యాఖ్యల్ని మీడియా కథనాల్లో చూశానని, పూర్తి సందర్భం వినలేదని చెప్పారు. థరూర్ తన వ్యాఖ్యలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సూచించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు బహిరంగంగా మాట్లాడేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ‘‘కాంగ్రెస్ సభ్యులు ఎప్పుడూ పార్టీ విధానాలు, క్రమశిక్షణ పాటించకపోయినా.. బీజేపీని మెప్పించేలా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడాలి’’ అని కేసీ వేణుగోపాల్ అన్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేసే అవకాశం దొరికితే బీజేపీ సంతోషిస్తుందని అన్నారు. థరూర్ ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేశారని తాను భావించడం లేదని చెప్పారు.
Also Read
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
ఇదే సమయంలో రాహుల్ గాంధీ జెన్-జీ యువతను ఆకట్టుకునేందుకు నిర్వహిస్తున్న విద్యార్థి కార్యక్రమానికి కేసీ వేణుగోపాల్ మద్దతు ఇచ్చారు. యూపీ అలహాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి సాధారణ కార్యకర్తలే కాకుండా పెద్ద సంఖ్యలో యువత వచ్చిందని అన్నారు. కోటా, డెహ్రాడూన్‌లో జరిగిన కార్యక్రమాల్లో కూడా ఇదే తరహా స్పందన కనిపించిందని అన్నారు. అలహాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్‌బస్టర్
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?