KC Venugopal: భయంకర విషాదాన్ని తృటిలో తప్పించుకున్నాం.. అదృష్టమే కాపాడింది!
- మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య
- ఎయిర్ ఇండియా విమానం చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- సంఘటనపై కాంగ్రెస్ అగ్రనేత పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KC Venugopal post about India Flight Emergency Landing: మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (AI2455)లో టెక్నికల్ ఇష్యూలు వచ్చాయి. గుర్తించిన పైలట్ చెన్నైలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వివరాల ప్రకారం.. విమానం రెండు గంటలకు పైగా గాలిలో ఉండి.. చివరకు చెన్నై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం రాత్రి 8 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరి.. రాత్రి 10.35 గంటలకు చెన్నైలో ల్యాండ్ అయిందని సమాచారం.
ఎయిర్ ఇండియా విమానంలో ఐదుగురు ఎంపీలు ఉన్నారు. ఎంపీలు కేసీ వేణుగోపాల్, కోడిక్కున్నిల్ సురేష్, అదూర్ ప్రకాష్, కే రాధాకృష్ణన్, రాబర్ట్ బ్రూస్‌లు తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సంఘటనపై కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో స్పందించారు. పైలట్ తక్షణ నిర్ణయం ప్రయాణికుల ప్రాణాలను కాపాడిందన్నారు. ‘భయంకర విషాదాన్ని మేము తృటిలో తప్పించుకున్నాం. నైపుణ్యం, అదృష్టం రెండూ మమ్నల్సి కాపాడాయి. క్లియరెన్స్ కోసం దాదాపు రెండు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో రన్‌వేపై మరొక విమానం ఉంది. రెండవ ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణీకులకు ఎప్పటికీ అదృష్టం కలిసిరాదు. ఈ సంఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరుకుతున్నా’ అని కేసీ వేణుగోపాల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
Also Read
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
Also Read: Telangana Rains: నేడు, రేపు భారీ వర్షాలు.. 13 నుంచి అతి భారీ వానలు!
చెన్నై విమానాశ్రయంలోని రన్‌వేపై మరొక విమానం ఉందన్న ఎంపీ కేసీ వేణుగోపాల్ వాదనను ఎయిర్ ఇండియా తోసిపుచ్చింది. సాంకేతిక సమస్య, వాతావరణ పరిస్థితుల కారణంగా చెన్నై వైపు విమానాన్ని మళ్లించాలని మేము నిర్ణయించుకున్నాం అని పేర్కొంది. ఇది ముందు జాగ్రత్త చర్య అని స్పష్టం చేయాలనుకుంటున్నామని తెలిపింది. చెన్నై విమానాశ్రయంలో మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ “గో-అరౌండ్” ఆదేశించిందని, రన్‌వేపై మరే ఇతర విమానం ఉండటం వల్ల కాదని ఎయిర్ ఇండియా అంటోంది.
Air India flight AI 2455 from Trivandrum to Delhi – carrying myself, several MPs, and hundreds of passengers – came frighteningly close to tragedy today.
What began as a delayed departure turned into a harrowing journey. Shortly after take-off, we were hit by unprecedented…
— K C Venugopal (@kcvenugopalmp) August 10, 2025
తాజావార్తలు
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!