Site icon NTV Telugu

MLC Kavitha : బీసీ బిల్ కోసం జులై 17 న రైలు రోకో

Kavitha

Kavitha

MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆమె, ముఖ్యమంత్రి చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపి, సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. “బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు నష్టం జరగదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతుండగా, గోదావరి జలాలను తరలించేందుకు కేసీఆర్ అప్పుడు ఒప్పుకున్నారని చెబుతున్నారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. కేసీఆర్ గోదావరి నీళ్లు సముద్రంలో వృథాగా పోకుండా వాడుకలోకి తేవాలని మాత్రమే అన్నాడు. కానీ, నదుల అనుసంధానం అంశానికి ఎప్పుడూ ఓకే చెప్పలేదు అని ఆమె వివరణ ఇచ్చారు.

Ye Maaya Chesave : ‘ఏ మాయ చేసావే’ ప్రమోషన్‌లో నేను లేను.. సమంత క్లారిటీ

ఏపీ కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని చెబుతున్నారు. అలా అయితే మన సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? చంద్రబాబుతో రేవంత్‌కు ఉన్న లాలూచీ ఏమిటి? అని ప్రశ్నించారు. నల్లమల టైగర్ అంటూ కాదు, పని చేసి చూపించండి “రేవంత్ రెడ్డి నల్లమల టైగర్ అంటూ చెప్పుకుంటున్నారు. అది నిజమే అయితే బొల్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలి. లేదంటే, మీరు కేవలం పేపర్ పులి అని ప్రజలకు తేటతెల్లం అవుతుంది,” అంటూ సెటైర్లు వేశారు. “ఢిల్లీకి హాఫ్ సెంచరీ కొడుతున్నారు కానీ బీసీల కోసం అడగడంలేదు. బీసీ బిల్లు గురించి మోదీని అడగాలి,” అని స్పష్టం చేశారు.

బీసీలకు రాజకీయం హక్కులు లభించేలా కేంద్రం వెంటనే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ, జులై 17న రైలు రోకో నిర్వహిస్తామని ప్రకటించారు. ఢిల్లీకి వెళుతున్న సీఎం.. బీసీ బిల్లు పట్టుకుని తిరిగి హైదరాబాద్‌కు రావాలి అంటూ హెచ్చరించారు.

Jakkampudi Raja: ఎన్ని కుయుక్తులు పన్నినా.. జన ప్రవాహాన్ని అడ్డుకోలేరు!

Exit mobile version