తమిళ హీరో కార్తీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తమిళ్లో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.. ఆయన సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి.. దాంతో తెలుగు ప్రేక్షకులకు కూడా కార్తీ పేరు సుపరిచితమే.. ఇటీవల వచ్చిన సినిమాలు ఓ మాదిరిగా ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టాడు.. 96వ చిత్రంగా తెరకేక్కుతున్న సినిమాలో తెలుగు హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నాడు.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..
శ్రీదివ్యకు మరో లక్కీచాన్స్ తలుపు తట్టింది. శివకార్తికేయన్‌కు జంటగా వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్రం ద్వారా కొలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో నటిగా మంచి మార్కులు వేయించుకుంది.. తెలుగులోనూ నటిగా పరిచయమైన ఈ బ్యూటీ ఇక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకోవడంతో వరుసగా అవకాశాలు వరించాయి. అలా ఈమె ఇక్కడ నటించిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయి కూడా.. ఈ మధ్య ఏమైందో కానీ సినిమా అవకాశాలు రాలేదని తెలుస్తుంది..
చాలా కాలంలో తర్వాత విక్రమ్‌ప్రభు సరసన నటించిన రైడ్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. అలా మళ్లీ వార్తల్లోకి వచ్చిన శ్రీదివ్య అవకాశాలపై దృష్టిపెట్టింది. మొత్తం మీద తాజాగా లక్కీచాన్స్ ఈ అమ్మడిని వరించింది. కార్తీతో రొమాన్స్ చేయబోతోంది. 96 చిత్రం ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటిస్తున్నారు.. తాజాగా గురువారం శ్రీదివ్య పేరును అధికారికంగా యూనిట్ వర్గాలు ప్రకటించాయి. ఈ అమ్మడు ఇంతకుముందు కార్తీ సరసన కాశ్మోరా చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.. ఈ జంట మరోసారి స్క్రీన్ ను షేర్ చేసుకుంటున్నారన్నమాట..