Fire Accident: సిద్దిపేట సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: సిద్దిపేట విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సబ్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం కారణంగా సిద్దిపేట పట్టణంతో పాటు పరిసర మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌లకు కూడా మంటలు వ్యాపించడంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హైదరాబాద్ నుంచి ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి విద్యుత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Read also: Maharastra : నేటి నుంచి సమ్మెకు దిగనున్న 8000మంది డాక్టర్లు.. నిలిచిపోనున్న వైద్య సేవలు
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
- CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు హరీశ్ రావు అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి సిద్దిపేటతో పాటు దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నుంచి అగ్నిమాపక వాహనాలను రప్పించారు. అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలను అదుపు చేయకపోవడంతో, మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటింగ్ ఫోమ్‌ను ఉపయోగించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేయాలని ట్రాన్స్‌కో అధికారులు, సిద్దిపేట విద్యుత్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ అధికారులను హరీశ్ రావు కోరారు. ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
Arvind Kejriwal: పెరిగిన నీటి బిల్లులపై అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చిన ఢిల్లీ సీఎం..
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!