కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఇక 80 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు కావాల్సి ఉంటుంది.