Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జల్సాలకు అలవాటు పడి, కష్టపడకుండా అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురాశతో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు బొద్దుల యుగేందర్‌ను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి దొంగిలించిన రూ. 5 లక్షల నగదు, 10 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు రికవరీ చేశారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఈ కేసు వివరాలను వెల్లడించారు. టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. సృజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దుర్షెడ్ గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్ (32) అనే వ్యక్తి వృత్తిరీత్యా నేరస్తుడు. ఇతనిపై గతంలోనూ అనేక దొంగతనాల కేసులు ఉన్నాయి. నేర ప్రవృత్తి కారణంగా గతంలో ఇతనిపై పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేసి జైలుకు పంపారు. అయితే.. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా యుగేందర్ తన పద్ధతి మార్చుకోలేదు.
ఏప్రిల్ 26వ తేదీ తెల్లవారుజామున మంకమ్మతోటలోని శ్రీ చైతన్య కాలేజీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాలో ఉన్న రూ. 5 లక్షల నగదును, ఒక బంగారు చైన్‌ను ఎత్తుకెళ్లాడు. దొంగిలించిన సొత్తును ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంటి వెనుక ఉన్న కట్టెల కుప్పలో దాచిపెట్టాడు.
Also Read
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
కాలేజీలో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక ఆధారాలు, నమ్మదగిన సమాచారంతో నిందితుడిని దుర్షెడ్ గ్రామంలోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడమే కాకుండా.. గతంలో చింతకుంట ఆంజనేయస్వామి గుడిలో హుండీ దొంగతనం చేసినట్లు కూడా ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడు దాచిన చోటు నుంచి రూ. 5 లక్షల నగదును, 10 గ్రాముల బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేరస్థులపై నిరంతరం నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి హెచ్చరించారు. తక్కువ సమయంలో కేసును ఛేదించి సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు బృందాన్ని సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!