Kantara : విడుదలైన అన్ని భాషల్లో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది కాంతార సినిమా. ఇప్పటికే రూ.300కోట్ల క్లబులో చేరి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. కాంతారా సినిమాతో రిషబ్ శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆయన స్వీయ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించారు. కాంతార సినిమాతో కేరళ.. కర్ణాటక ఆదివాసీల భూతకోల ఆచార సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేశారు. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో స్పందన వస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రిషబ్ శెట్టి.
Read Also: Alia Bhatt: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా భట్
బాలీవుడ్ మూవీస్ వరుసగా ప్లాప్ కావడం పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమాను వ్యక్తిగత వినియోగం కోసం కాకుండా.. ప్రేక్షకులకు ప్రాధాన్యతనిస్తూ వారి అభిరుచిని దృష్టిలో ఉంచుకుని సినిమాలను రూపొందించాలంటూ బాలీవుడ్ మేకర్లకు పరోక్షంగా చురకలంటించారు. హిందీలో కాంతార సినిమా ఇప్పటికే రూ. 54 కోట్లు వసూలు చేసింది. కేజీఎఫ్ తర్వాత రెండవ అతి పెద్ద కన్నడ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో కిషోర్, సప్తమి గౌడ మరియు అచ్యుత్ కుమార్ కూడా నటించారు. ఈ సినిమాలో స్థానిక ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఆధిపత్య పోరును చూపించారు.