Alia Bhatt: బాలీవుడ్ స్టార్ కిడ్ ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఆదివారం ఆలియా భట్ పురిటి నొప్పుల నిమిత్తం ముంబైలోని హెచ్ఎస్ రిలయన్స్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే పండంటి ఆడబిడ్డకు జన్మ నిచ్చినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వారు ప్రకటించారు. ఈ శుభవార్తతో కపూర్ కుటుంబంలో సంతోషం వెల్లివెరిసింది. ఆలియాను చూసేందుకు బంధువులు, ఆమె సన్నిహితులు ఆస్పత్రికి తరలివస్తున్నారు. మరో వైపు ఆలియా భట్ కు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రణబీర్ కపూర్ తో ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రెండు నెలలకు ప్రెగ్నెన్సీని ఆలియా భట్ ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. అప్పట్లో ఆసుపత్రిలో పరీక్షలకు సంబంధించిన ఓ ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నారు.
Prabhas New Movie: సంక్రాంతికి బరి నుంచి ప్రభాస్ సినిమా ఔట్.. రూ.100కోట్లతో రీ ష్యూట్
Bala Krishna : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్.. మామూలుగా ఉండదైతే