కన్నడలో సంచలన విజయాన్ని సాధించిన ‘కాంతార’కు, ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులను పూర్తిగా అలరించి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రిషబ్ శెట్టి స్వయంగా కథ, దర్శకత్వం, నటన బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రం గ్రామీణ ఫోక్ ఎలిమెంట్స్, దైవశక్తి నేపథ్యంలో రూపొందిన వినూత్న కథతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎక్కడ చూసినా మంచి రెస్పాన్స్‌తో సాగుతూ థియేటర్లలో నిలకడైన కలెక్షన్లను నమోదు చేస్తోంది. తాజాగా ఈ చిత్రం తన థియేట్రికల్ రన్‌లో 50 రోజులు పూర్తి చేసుకోవడం చిత్ర యూనిట్‌కు ప్రత్యేక గర్వ కారణంగా మారింది.
Also Read : Allari Naresh : ‘సుడిగాడు 2’పై అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్..!
ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మరియు టీమ్ తమ సినిమాను ఎంతో ప్రేమగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ అందించిన సంగీతం సినిమాకు ఎమోషనల్ టోన్‌ను మరింత బలోపేతం చేసింది. ఇక థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతూ అక్కడ కూడా అదే స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. కంటెంట్‌కి ఉన్న నాణ్యత, రిషబ్ శెట్టి కథన శైలి, ఫోక్-మిస్టికల్ వాతావరణం గా ‘కాంతార చాప్టర్ 1’ను ఈ ఏడాది అత్యంత గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలబెట్టాయి.