అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘12A రైల్వే కాలనీ’ మూవీతో నేడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాని కసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమాక్షీ భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో నరేష్ యాక్టివ్‌గా పాల్గొంటూ, మీడియా – మీమర్లతో సరదాగా మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెడుతున్నారు. ఈ చిట్‌చాట్‌లో భాగంగా ఆయన కెరీర్‌కి స్పెషల్ ఇమేజ్ తెచ్చిన కల్ట్ కామెడీ మూవీ ‘సుడిగాడు’ గురించి ప్రస్తావన వచ్చింది. అదే సందర్భంలో నరేష్, ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న సుడిగాడు సీక్వెల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : Deepika Padukone: ఆ తప్పులు గుర్తొస్తే ఇప్పటికి బాధేస్తుంది.. దీపిక ఎమోషనల్ కామెంట్స్
‘‘సుడిగాడు 2 కోసం రైటింగ్ వర్క్ కొనసాగుతోంది. మొదటి పార్ట్‌లో దాదాపు 100 సినిమాలను ప్యారడీ చేశాం. ఈసారి దానికి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాం. కాబట్టి స్క్రిప్ట్‌పై బాగా వర్క్ జరుగుతోంది’’ అని చెప్పారు. ప్రస్తుతం భారీ విజయాలు సాధిస్తున్న పాన్ ఇండియా సినిమాలు కూడా ఈ సీక్వెల్‌లో భాగం కానున్నాయని వెల్లడించారు. ‘‘ఈసారి యానిమల్, పుష్ప 2 వంటి పెద్ద సినిమాలపై కూడా ఫన్నీ స్పూఫ్స్ జోడించాలని చూస్తున్నాం. ప్రేక్షకులు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మాకు తెలుసు కాబట్టి, ఆ లెవెల్‌లోనే కామెడీ సెట్ చేస్తున్నాం’’ అని చెప్పారు. అయితే ప్రాజెక్ట్ గురించి ఇంకా చాలా ఎర్లీ స్టేజ్‌లో ఉన్నామని, స్క్రిప్ట్ పూర్తయ్యేందుకు సమయం పడుతుందని నరేష్ స్పష్టం చేశారు. “ప్రస్తుతం ప్లానింగ్ స్టేజ్‌లో ఉన్నాం. షూట్ స్టార్ట్ కావడానికి ఇంకా టైమ్ ఉంది. అనుకున్న టైం కి జరిగితే 2027లో ప్రారంభమయ్యే అవకాశముంది” అని అల్లరి నరేష్ క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటికే నరేష్ ఇచ్చిన ఈ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటి భాగం ఎంత హిట్ అయ్యిందో తెలిసిన ప్రేక్షకులు సీక్వెల్ కోసం ఇంకా ఎక్కువ ఎక్స్ఫైట్మెంట్ చూపిస్తున్నారు. టాలీవుడ్‌లో కామెడీ సినిమాలు కొంచెం తగ్గిన ఈ సమయంలో ‘సుడిగాడు 2’ ఒక మంచి ఫన్ ఎంటర్‌టైన్‌ర్‌గా నిలవనుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది.