కన్నడలో సంచలన విజయాన్ని సాధించిన ‘కాంతార’కు, ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులను పూర్తిగా అలరించి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రిషబ్ శెట్టి స్వయంగా కథ, దర్శకత్వం, నటన బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రం గ్రామీణ ఫోక్ ఎలిమెంట్స్, దైవశక్తి నేపథ్యంలో రూపొందిన వినూత్న కథతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎక్కడ చూసినా మంచి రెస్పాన్స్‌తో సాగుతూ థియేటర్లలో నిలకడైన కలెక్షన్లను నమోదు…