గతంలో ఎంతో మంది కన్నడ భామలు టాలీవుడ్ లో తమ లక్ పరీక్షించుకునేందుకు ప్రయత్నించినా రష్మిక మందన్న సక్సెస్ తర్వాత క్యూలైన్ పెరిగింది. ఎవ్రీ ఇయర్ శాండిల్ వుడ్ నుండి కొత్త అందాలు టీటౌన్ లోకి అడుగుపెట్టి సిల్వర్ స్క్రీన్ ను కలర్ ఫుల్ చేస్తున్నాయి. అలాగే ఈ ఏడాది కూడా ఇద్దరు క్రేజీయెస్ట్ భామలు టీటౌన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కేజీఎఫ్ తో యష్ ఓవర్ నైట్ స్టార్ గా మారినట్లే కన్నడ కస్తూరి శ్రీనిధి శెట్టి కూడా పాపులర్ అయ్యింది. ఫస్ట్ రెండు చిత్రాలతోనే పాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ విక్రమ్ కోబ్రాతోనూ కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది.
Also Read : Anirudh : అనిరుధ్ చాలా కాస్ట్లీ గురూ.. జైలర్ 2కు ఎంత తీసుకున్నాడో తెలుసా..?
శాండిల్ వుడ్, కోలీవుడ్ నుండి టాలీవుడ్ వైపు టర్న్ ఇచ్చింది ఈ కన్నడ సోయగం శ్రీనిధి. టీటౌన్ లో బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు కొల్లగొట్టింది. నాని హిట్ 3తో పాటు సిద్దు జొన్నలగడ్డతో తెలుసు కదాలో కనిపించబోతుంది. ఈ టూ ప్రాజెక్ట్స్ ఈ ఏడాదిలో రిలీజ్ కాబోతున్నాయి. ఇవే కాకుండా కిచ్చా సుదీప్ 47 మూవీకి కూడా కమిటయ్యింది ఈ శాండిల్ వుడ్ చిన్నది. మరో శాండిల్ వుడ్ భామ సప్తమి గౌడ మరోలా ప్లాన్ చేసుకుంటుంది. కాంతారతో పాపులారిటీ తెచ్చుకున్న సప్తమి వాక్సిన్ వార్ సినిమాతో హిందీలోకి అడుగెట్టింది. లాస్ట్ ఇయర్ యువ రాజ్ కుమార్ యువతో సక్సెస్ అందుకున్న ఈ భామ టాలీవుడ్ పై కన్నేసింది. నితిన్ అప్ కమింగ్ చిత్రాల్లో ఒకటైన తమ్ముడుతో బిగ్గెస్ట్ ఇండస్ట్రీలోకి జాయిన్ అవుతుంది. మరీ ఈ చందన భామల్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారెదెవరో వేచిచూడాలి.