అబ్బా బక్కోడు ఏం కొడుతున్నాడ్రా వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్స్, ఎలా వస్తాయి రా ఇలాంటి కంపోజింగ్స్. పిచ్చోళ్లు అయిపోవాల్సిందే అనుకునేంతలా సక్సీడ్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్. బీజీఎమ్స్, సాంగ్స్ తో సినిమా భారీ విజయంలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఎట్ ప్రెజెంట్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవతరించాడు. ఈ క్రేజ్ చూస్తుంటే. ఒకప్పటి ఏఆర్ రెహమాన్ మేనియాను గుర్తు చేస్తున్నాడు. యునిక్ స్టైల్లో బాణీలు సమకూర్చి తక్కువ టైంలోనే సక్సెస్ ఫుల్ అండ్ స్టార్ కంపోజర్ గా ఛేంజ్ అయ్యాడు ఏఆర్ రెహమాన్. ఇప్పుడు అనిరుధ్ విషయంలోనూ ఇదే జరుగుతుంది.
Also Read : Nabha Natesh : ‘నభా’వి ఏమున్నా’యబ్బా’ కానీ.. అవి కాదు
తొలి సినిమా ‘3’ తోనే వైదిస్ కొలవెరీ ఢీ అంటూ యూత్ తో పాటు యూట్యూబ్ ను షేక్ చేసిన అనిరుధ్ వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వణక్కం చెన్నై, జెర్సీ, మాస్టర్, బీస్ట్, విక్రమ్, జైలర్, జవాన్, దేవర చిత్రాలు అతడికి స్టార్ ఇమేజ్ కట్టబెట్టాయి. నేమ్, ఫేమ్ రావడం ఆఫర్లు పెరగడంతో డిమాండ్ ఉన్నప్పుడే రూపాయి వెనకేసుకోవాలన్న థాట్ తో రెమ్యునరేషన్ కూడా పెంచేశాడు. జైలర్ సినిమాకు రూ. 8 నుండి పది కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. ఆ తర్వాత వచ్చిన బాలీవుడ్ ఎంట్రీ మూవీ జవాన్ కు కూడా రూ. 10 కోట్లకు పైగా చార్జ్ చేశాడని సమాచారం. ఇప్పుడు జైలర్ 2 కూడా సుమారుగా రూ. 18 కోట్లను ముక్కు పిండి వసూలు చేస్తున్నాడట. ఈ లెక్కన చూస్తే హయ్యెస్ట్ పేయర్ ఇండియన్ సినీ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ను క్రాస్ చేశాడని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.