జగన్ ప్రభుత్వ పాలనపై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. దమ్ముంటే రాజకీయం చేయండి.గాలోల్ల చేత బూతులు తిట్టించి రాజకీయాలు చేయవద్దు…తప్పుడు కేసులు పెట్టి ఓ రిటైర్డ్ ఐఏఎస్ ను ఢిల్లీ నుండి తీసుకు వచ్చి కొడతారా? సీనియర్ మాజీ ఐఏఎస్ శ్రీకాంత్ ను ప్రభుత్వం వేధిస్తుంది…పోలీసు వ్యవస్థను దిగ జార్చి కొంతమంది అధికారులు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారు.
Read Also: Mumbai Indians: ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన ముంబై.. ఢిల్లీపై గ్రాండ్ విక్టరీ
గతంలో నేను మంత్రి గా ఐదుగురు ముఖ్య మంత్రు ల వద్ద 14 ఏళ్లు పని చేశాను. సీఐడీని అడ్డం పెట్టి అధికారులను వేధించే ఇలాంటి సీఎంని నేను ఎక్కడ చూడలేదు. సీఎం జగన్ చేస్తున్న అరాచకం ఆపాలి…జగన్ బాబాయ్ కేసు లో సీబీఐ ఏం చెప్తుంది జగన్ కు వినపడటం లేదా..గత టీడీపీ ప్రభుత్వం లో మూడు లక్షల కోట్లు అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు..ఒక్క ఆధారం ఐనా నిరూపించ గలిగారా?
Read Also: Bonda Uma: అర్జా శ్రీకాంత్ ని వేధిస్తే తాటతీస్తాం