కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు.సూర్య 42 వ మూవీ గా వస్తున్న కంగువ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు పోస్టర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కంగువ మూవీ 2024 వేసవి లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందంటూ ఇప్పటి వరకు వార్తలు తెగ వైరల్ అయ్యాయి.అయితే ప్రస్తుతం కంగువ మూవీ ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న వార్త తెగ వైరల్ అవుతుంది.తాజా టాక్ ప్రకారం కంగువ షూటింగ్ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
దీనితో మేకర్స్ ఈ సినిమాను 2024 సెప్టెంబర్‌లో కానీ లేదా దీపావళికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలున్నట్టు సమాచారం.కంగువ మూవీ ౩డీ ఫార్మాట్‌లో కూడా విడుదల కానుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు సంగీతం అందిస్తున్నాడు. గతానికి, ప్రస్తుత కాలానికి మధ్య ఉండే కనెక్షన్ తో సాగే స్టోరీ లైన్ ఆధారంగా కంగువ సినిమా రాబోతుందని సమాచారం.ఈ చిత్రం లో సూర్య వారియర్ గా, లీడర్ గా డిఫరెంట్ షేడ్స్‌లో నయా అవతార్‌లో కనిపిస్తు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు.ఇదిలా ఉంటే సూర్య మరోవైపు సుధా కొంగర డైరెక్షన్‌లో సూర్య 43లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి సరికొత్త అప్‌డేట్ రావాల్సి ఉంది.ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటి దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఇటీవల యానిమల్ మూవీ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాబీ డియోల్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.