Virat Kohli: “ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు”.. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్లో ఒక సుదీర్ఘమైన, అత్యంత హుందాతనమైన అధ్యాయం ముగిసింది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ఆధునిక క్రికెట్ ‘ఫాబ్ ఫోర్’ (Fab Four)లో ఒకరైన కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత ఏడాదిలోనే అతడు టీ20లకు గుడ్‌బై చెప్పగా, తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టే ఆయనకు చివరి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్‌లో విలియమ్సన్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు చేశాడు. కివీస్ జట్టు 115 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ, విలియమ్సన్ కెరీర్ మాత్రం అజరామరంగా నిలిచిపోతుంది. 378 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 48 శతకాలు, 6 ద్విశతకాలతో 19,346 పరుగులు సాధించి, న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కేన్ రికార్డు సృష్టించాడు.
ఇక, విలియమ్సన్ రిటైర్మెంట్ ప్రకటనపై భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎంతో భావోద్వేగభరితమైన సందేశాన్ని పంచుకున్నాడు. “ఇన్నాళ్ల ప్రయాణంలో ఒక ప్రత్యర్థి నుంచి మంచి స్నేహితుడిగా మారావు” అంటూ వారి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. 2008 అండర్-19 ప్రపంచకప్ నుంచి మొదలైన వీరిద్దరి ప్రయాణం, ఆ తర్వాత పదిహేనేళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌ను శాసించే స్థాయికి చేరింది. మైదానంలో గట్టి పోటీదారులుగా ఉన్నప్పటికీ, వెలుపల మాత్రం వారి మధ్య బలమైన స్నేహం ఏర్పడింది. “ఇన్నాళ్ల ప్రయాణంలో ఒక ప్రత్యర్థి నుంచి ఓ మంచి స్నేహితుడిగా మారావు. ఇన్నేళ్లుగా నువ్వు బ్యాటింగ్ చేయడం చూడటం, నీతో పోటీ పడటం నాకు దక్కిన గొప్ప ఆనందం. అంతకుమించి, మన మధ్య ఉన్న స్నేహం, ఆట, జీవితం గురించి మనం పంచుకునే ఆలోచనలను నేను ఎంతో గౌరవిస్తాను. మనం మాట్లాడుకున్న ప్రతిసారీ, కలుసుకున్న ప్రతిసారీ ఆ క్షణాలను నేను ఎప్పటికీ గుర్తుగా దాచుకుంటాను. నీకు ఎప్పుడూ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను సోదరా. నువ్వు చేయాల్సిన బాధ్యతను అత్యద్భుతంగా పూర్తి చేశావు. ఇప్పుడు వీటన్నింటినీ ఆస్వాదిస్తూ, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో.. చాలా బాగా ని కర్తవ్యాన్ని పూర్తి చేశావు మిత్రమా… నీ అసలైన జీవితం ఇప్పుడే మొదలైంది!” అని విరాట్ ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
Also Read
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
ఇక, క్రికెట్ ఆటగాడిగానే కాకుండా, ఒక లీడర్‌గానూ కేన్ విలియమ్సన్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. 2016 నుంచి 2024 వరకు మూడు ఫార్మాట్లలో కివీస్ జట్టును నడిపించిన అతడు అత్యంత ప్రశాంతమైన కెప్టెన్సీ శైలికి మారుపేరుగా నిలిచాడు. కేన్ నాయకత్వంలో న్యూజిలాండ్ జట్టు రెండుసార్లు వన్డే ప్రపంచకప్ ఫైనల్స్, మూడుసార్లు సెమీఫైనల్స్ చేరడమే కాకుండా.. 2021లో జరిగిన మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC)ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. మైదానంలో ఎప్పుడూ చిరునవ్వుతో క్రీడాస్ఫూర్తిని చాటే విలియమ్సన్ వంటి ఒక జెంటిల్మన్ క్రికెటర్ సేవలను అంతర్జాతీయ క్రికెట్ ఖచ్చితంగా మిస్ అవుతుంది.
From an opponent to a friend over the years. It’s been a pleasure watching you bat and compete against you over so many years but more than that I value our friendship and shared perspectives on the game and beyond. I continue to cherish every time we speak or meet. Wishing you…
— Virat Kohli (@imVkohli) June 12, 2026
తాజావార్తలు
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!