Kavitha: మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి కల్వకుంట్ల కవిత వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెండు రోజుల క్రితం హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కవిత అంత్యక్రియలకు హాజరుకాలేదు. దీనితో హరీష్‌రావుతో ఉన్న విభేదాల కారణంగానే రాలేదని అనేక ఊహాగానాలు చెలరేగాయి. అయితే మూడు రోజుల తర్వాత, గురువారం ఉదయం కవిత హరీష్‌రావు నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను కలుసుకున్నారు. సత్యనారాయణరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. కాసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.
READ MORE: Smartphones Launch In November: నవంబర్లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేయనున్న ఫోన్స్ ఇవే..!
అయితే.. గతంలో మాజీ మంత్రి హరీష్‌రావుపై సంచలన ఆరోపణలు చేశారు కవిత. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో హరీష్‌రావుపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై హరీష్‌రావు ప్రత్యక్షంగా స్పందించలేదు. తాను ఉద్యమం నుంచి ఉన్నారని, తన ప్రస్థానం తెరిచిన పుస్తకమంటూ పరోక్షంగా స్పందించారు. కవిత హరీష్‌రావుపై చేసిన ఆరోపణల అనంతరం ఆమె ఆయన ఇంటికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ తాజా తరుణం అటు బీఆర్ఎస్ ఇటు జాగృతి శ్రేణుల్లో ఆసక్తి రేకెత్తించింది.
READ MORE: Hyderabad: 5.04 కి.మి మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు షురూ.. ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్..!
