Hyderabad Elevated Corridor: ప్యారడైజ్ నుంచి డైరీ ఫార్మ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. బాలంరాయి నుంచి డెయిరీఫామ్ వరకు 5.04 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ వద్ద 600 మీటర్ల మేర సొరంగమార్గం నిర్మించనున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ రన్ వేకు ఎలాంటి ఆటంకం లేకుండా భారీ టన్నెల్ నిర్మాణం చేపడతారు. బోయిన్‌పల్లి జంక్షన్ వద్ద రెండు వైపులా 248 మీటర్ల నుంచి 475 మీటర్ల పొడవు, 8 మీటర్ల పొడవుతో ఎంట్రీ, ఎగ్జిట్‌లు ఏర్పాటు చేస్తారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా బలంరాయి వద్ద నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్యారడైజ్ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్టు వెనుక వైపు వరకు ట్రాఫిక్ మళ్ళింపు కొనసాగుతోంది. కొంపల్లి నుంచి నగరానికి వస్తున్న వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముందస్తు ప్రకటనలు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.