Kavitha: మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెండు రోజుల క్రితం హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కవిత అంత్యక్రియలకు హాజరుకాలేదు. దీనితో హరీష్‌రావుతో ఉన్న విభేదాల కారణంగానే రాలేదని అనేక ఊహాగానాలు చెలరేగాయి. అయితే మూడు రోజుల తర్వాత, గురువారం ఉదయం కవిత హరీష్‌రావు నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను కలుసుకున్నారు.