Kalvakuntla Himanshu : చదువుతో పాటు సామాజిక సేవకూ సమ ప్రాధాన్యత ఇస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓక్రిడ్జ్ స్కూల్ కార్నివాల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. సృజనాత్మక, సామాజిక థృక్పథం థీం తో నిర్వహించిన కాస్నివాల్ (CASnival) కు ఇంఛార్జి గా హిమాన్షు వ్యవహిరించాడు. ఈవెంట్ లో భాగంగా ఏర్పాటుచేసిన 30కి పైగా స్టాల్స్ తో విద్యార్థులు తమ కళాత్మకతను ప్రదర్శించారు. ఫుడ్, ఫన్, గేమ్స్ ప్రదర్శనగా కొనసాగిన కాస్నివాల్ (CASnival) ఈవెంట్ లో ఓక్ జైలు, సైకిల్ పెయింటింగ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ తో తమలోని ప్రతిభను చూపించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఈవెంట్ కు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక ఈ కాస్నివాల్ (CASnival) కు ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. కాస్నివాల్ (CASnival) లోని స్టాల్స్ ను పరిశీలించారు. హిమాన్షు అతని స్నేహితుల సృజనాత్మకత, సామాజిక దృక్పథాన్ని అభినందించారు.
Also Read : Tarakaratna: అన్న ఆరోగ్యంపై తమ్ముడి ట్వీట్.. వైరల్
Also Read
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
- Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
- Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి… నేటితరం పిల్లల ఆలోచన విధానానికి ఈ కాస్నివాల్ (CASnival) ప్రతీక అన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమ కాళ్లపై తాము నిలబడే ఆత్మస్థైర్యాన్ని ఇలాంటి ఈవెంట్స్ విద్యార్థులకు ఇస్తాయన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో మాదిరిగానే గవర్నమెంట్ స్కూల్స్ లోనూ పలు ఇన్నోవేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఈ కాలం పిల్లల ఆలోచనలు అందుకోవడం తమ లాంటి వాళ్లకు ఎంతో కష్టమన్నారు. తాము రాష్ట్రాన్ని చదివితే ఈ పిల్లలు ప్రపంచాన్నే చదువుతున్నారని మెచ్చుకున్నారు. హైదరాబాద్ లో మురికి కూపాలుగా మారిన చెరువులను పునరుద్దరించేందుకు సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ మనవడిగా సమాజానికి ఉపయోగపడే మంచి ఆలోచనలతో హిమాన్షు తన మిత్ర బృందంతో కలిసి పనిచేయడం సంతోషకరం అన్నారు. ఈ తరం పిల్లలు చదువుతో పాటు సామాజిక ఆలోచనలను అలవర్చుకుని మెరుగైన సమాజానికి బాటలు వేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. ఇలాంటి యువతే దేశానికి, రాష్ట్రానికి అవసరం అన్నారు. కొత్త ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యం అవుతాయని చెప్పారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన టీ హబ్ యువతకు ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. కార్నివాల్ తో వచ్చే డబ్బులను నానక్ రాం గూడ చెరువు పునరుద్దరణ, సుందరీకరణ కోసం ఇవ్వడం మంచి ఆలోచన అన్నారు. ఓక్రిడ్జ్ స్కూల్ పిల్లలు భవిష్యత్తు లో రోల్ మోడల్ గా నిలుస్తారని సబితా ఇంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : Waltair Veerayya: వాల్తేరు వీరయ్య విజయోత్సవ వేడుకలో అపశృతి.. అభిమానులకు గాయాలు
ఓక్రిడ్జ్ స్కూల్ క్రియేటివిటీ, యాక్టివిటీ, సర్వీస్ (CAS) ప్రెసిడెంట్ గా ఈ కాస్నివాల్ (CASnival) ను నిర్వహించిన హిమాన్షు మాట్లాడుతూ… తమ కాస్నివాల్ (CASnival) ఈవెంట్ పర్యావరణం, విద్యకు మధ్య వారధి లాంటిదన్నారు. తాను చదువుతో పాటు సామాజిక సేవకూ సమ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. చదువుకుని మంచి మార్కులు సంపాదించినప్పుడు ఎంత సంతోషిస్తానో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఎవరికైనా సాయం చేసినప్పుడు వాళ్ల ముఖంలో కనిపించే చిరునవ్వులో పొందుతానన్నారు. కాస్నివాల్ (CASnival) తో సమకూరే డబ్బులతో నానక్ రామ్ గూడ చెరువును పునరుద్దరిస్తాన్న హిమాన్షు…ఆ ప్రయత్నంలో విజయవంతం అయిన రోజు ప్రపంచాన్నే గెలిచినంత గొప్పగా ఫీలవుతానన్నారు. తమ ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. చెరువులను ఎలా పరిరక్షించాలనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, వారిని పర్యావరణ వేత్తలుగా మార్చడమే తమ మిత్ర బృందం లక్ష్యమన్నారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి కాస్నివాల్ (CASnival) ను నిర్వహించామన్న హిమాన్షు. స్టాల్స్ నిర్వహణతో విద్యార్థులు యువ పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం ఉందన్నారు. ఓక్రిడ్జ్ లో ఎంతో ఘనంగా నిర్వహించిన కాస్నివాల్ (CASnival) ఈ వెంట్ లో సినీ హీరోలు నిఖిల్, కిరణ్ అబ్బవరం లు సందడి చేశారు.
తాజావార్తలు
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
-
Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
-
Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
-
CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!