Tarakaratna: నందమూరి తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయనకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని వారు పేర్కొన్నారు. నేటి ఉదయం ఆయనకు మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు తరలించిన విషయం తెల్సిందే. ఐసీయూలో తారకరత్నకు డాక్టర్స్ వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటికే హాస్పిటల్ వద్దకు తారకరత్న తల్లిదండ్రులు శాంతి, మోహనకృష్ణ.. భార్య అలేఖ్య రెడ్డి, కూతురు నిషిత, నందమూరి బాలకృష్ణ చేరుకున్నారు. మరోపక్క సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తారకరత్న కోలుకోవాలని కోరుకుంటున్నారు. తాజగా తారకరత్న తమ్ముడు నందమూరి కళ్యాణ్ రామ్.. అన్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు. “నా సోదరుడు శ్రీ నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను “అంటూ ట్వీట్ చేశారు.
RRR: అక్కడ కూడా 100 డేస్.. ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్ అలాంటింది
ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్ నేడు ఈ సినిమాలోని సాంగ్ ను రిలీజ్ చేయడానికి పముహూర్తం ఖరారు చేశారు. బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రం సినిమాలో ఎన్నో రాత్రులొస్తాయి కానీ సాంగ్ ను రీమిక్స్ చేశారు. ఈ లిరికల్ వీడియోను ఈరోజు రిలీజ్ చేయాలని చూడగా.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సైతం బెంగుళూరు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నా సోదరుడు శ్రీ నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను .
Get well soon and get back to complete health brother.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 28, 2023