Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెం. 77పై తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. సినిమా థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరల ఖరారుకు సంబంధించి జారీ చేసిన ఈ ఉత్తర్వులను మరోసారి సమగ్రంగా సమీక్షించాలని కోరుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిల్మ్ ఛాంబర్ లేఖ రాయడంతో పాటు అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ జీవో అమలు వల్ల తలెత్తే పరిణామాలపై స్పష్టతనిస్తూ, ఎలాంటి తుది నిర్ణయాలు లేదా మార్పులు చేసే ముందైనా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అన్ని ప్రధాన భాగస్వాములతో (స్టేక్‌హోల్డర్స్) విస్తృతంగా చర్చించాలని ఫిల్మ్ ఛాంబర్ గౌరవ కార్యదర్శి వి.ఎల్. శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్లతో పాటు నిర్మాతలు, పంపిణీదారులు (డిస్ట్రిబ్యూటర్లు), ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
కొత్త జీవోలో చేర్చిన “స్పెషల్ థియేటర్” కేటగిరీ, వాటికి విధించిన నిబంధనలు మరియు సవరించిన ధరల నిర్మాణం వల్ల క్షేత్రస్థాయిలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఛాంబర్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని సింగిల్ స్క్రీన్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించాలని కోరింది. పరిశ్రమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, సింగిల్ స్క్రీన్ల మనుగడను కాపాడే దిశగా ప్రభుత్వం తక్షణమే సంబంధిత వర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కోరింది. సినీ పరిశ్రమకు నష్టం వాటిల్లకుండా, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో ధరలు, నిబంధనలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఛాంబర్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Also Read
- Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
- Janga Glimpse : నోట్లో మందు బాటిల్.. వరలక్ష్మి తూటాల వర్షం
- Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. 'ఆకాశంలో ఒక తార'కు బన్నీ బూస్ట్!
- Dil Raju - Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్‌తోనే సినిమా!
తాజావార్తలు
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!