CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
- సివిల్ డ్రెస్‌లో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ
- రెండు సార్లు బైక్‌పై తిరిగిన సీపీ
- వన్‌వే ట్రాఫిక్‌పై సంతృప్తి వ్యక్తం
- నగరవాసులు సహకరించాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CP VC Sajjanar : కేబీఆర్ పార్కు పరిసరాల్లో నూతనంగా అమలులోకి తెచ్చిన వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ స్వయంగా పరిశీలించారు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఒక సాధారణ పౌరుడిలా సివిల్ దుస్తుల్లో బైక్‌పై ప్రయాణిస్తూ ఆయన క్షేత్రస్థాయి ట్రాఫిక్ పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
రెండు సార్లు బైక్‌పై తిరిగి క్షేత్రస్థాయి పర్యవేక్షణ
రోడ్ నంబర్ 45 నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్, వెంకటగిరి, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు, ముగ్ధ జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్‌నగర్ జంక్షన్ మీదుగా తిరిగి రోడ్డు నంబర్ 45 వరకు సీపీ సజ్జనర్ రెండు సార్లు బైక్‌పై తిరుగుతూ మార్గంలో ట్రాఫిక్ ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో కూడా మరోసారి వెళ్లి ట్రాఫిక్ సరళిని పర్యవేక్షించారు. ఈ క్రమంలో అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్‌నగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్కు ప్రధాన గేటు తదితర కూడళ్ల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి అక్కడ నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
సాఫీగా సాగుతున్న వన్‌వే.. నగరవాసులు సహకరించాలి
ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ, కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని తెలిపారు. బుధవారం ఈ విధానాన్ని ప్రారంభించిన తొలిరోజు లేన్ల మార్పిడి విషయంలో వాహనదారులు కాస్త అయోమయానికి గురైనప్పటికీ, గురువారం నాటికి పరిస్థితులు పూర్తిగా చక్కబడ్డాయని చెప్పారు. వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జంక్షన్లలో స్పష్టమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు తగినంత మంది సిబ్బందిని విధుల్లో ఉంచినట్లు ఆయన వివరించారు.
అలాగే జీహెచ్ఎంసీ , నిర్మాణ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ హెచ్-సిటీ ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పనులు పూర్తయ్యేంత వరకు నగరవాసులు సహకరించి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే సూచనలను పాటించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!