Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banana Prices Hike in Ravulapalem Market: శ్రావణమాస శోభతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం అరటి మార్కెట్ కళకళలాడుతోంది. పండుగలు, పూజల నేపథ్యంలో అరటిపండ్లకు డిమాండ్ పెరగడంతో.. మార్కెట్ యార్డ్ మొత్తం రైతులు, కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. అరటి గెలలకు భారీ గిరాకీ రావడంతో ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం రావులపాలెం మార్కెట్లో ఒక్కో అరటి గెల ధర రూ.800 నుంచి రూ.1,000 వరకు పలుకుతోంది. గత 15 రోజులుగా ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అరటి దిగుబడి తగ్గడం, మరోవైపు మార్కెట్లో డిమాండ్ పెరగడంతో ధరలకు రెక్కలు వచ్చాయి.
శ్రావణమాసంలో పూజలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో స్థానికంగా అరటిపండ్ల వినియోగం గణనీయంగా పెరిగింది. డిమాండ్‌కు తగిన స్థాయిలో సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ధరలు మరింత పెరుగుతున్నాయి. దీంతో చాలాకాలం తర్వాత రావులపాలెం అరటి మార్కెట్లో శ్రావణ సందడి కనిపిస్తోంది. కోనసీమలో పండించే అరటికి ఇతర రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు భారీగా అరటి కొనుగోళ్ల కోసం రావులపాలెం మార్కెట్‌కు క్యూ కడుతున్నారు. దీంతో మార్కెట్ యార్డ్ నిత్యం రద్దీగా మారింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
కర్పూర, చక్కరకెళ్ల రకాల అరటికి అత్యధిక గిరాకీ ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ రకాల అరటిని కొనుగోలు చేసేందుకు పక్క రాష్ట్రాల వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో లోడుపై కూడా గతంతో పోలిస్తే అదనంగా రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు ధర లభిస్తున్నట్లు తెలుస్తోంది. ధరలు పెరగడంతో అరటి రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాధారణంగా దిగుబడి తగ్గితే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ పెరగడంతో రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే.. అరటి రైతులకు గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కోనసీమ అరటికి దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్, శ్రావణమాసంలో స్థానిక వినియోగం పెరగడం, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కొనుగోళ్లతో రావులపాలెం మార్కెట్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..