Waltair Veerayya: వాల్తేరు వీరయ్య విజయోత్సవ వేడుకలో అపశృతి.. అభిమానులకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. మాస్ మహారాజా రవితేజ, చిరంజీవి అన్నదమ్ములుగా కనిపించడం, వింటేజ్ చిరంజీవి మాస్ గెటప్, సాంగ్స్ ప్రేక్షకులను థియేటర్స్ వైపు నడిపించాయి. దీంతో ఈ సినిమా విజయోత్సవ వేడుకను గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. నేడు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో వీరయ్య విజయ విహారం అనే పేరుతో ఈ ఈవెంట్ కొద్దిసేపటి క్రితమే ఘనంగా ప్రారంభమయ్యింది. అయితే వాల్తేరు వీరయ్య విజయోత్సవ వేడుకలో అపశృతి చోటుచేసుకొంది. వాల్తేరు వీరయ్య విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరిగింది.
Read Also: Etela Rajender : మాటలకే పరిమితమైన ఎస్ఎల్బీసీ
Also Read
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
- LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
- Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లోకి వెళ్లేందుకు అభిమానులు గేటు ముందు నిలబడ్డారు. ఇక సమయం కావడంతో ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేయడంతో అభిమానులు తోసుకుంటూ ముందుకు వెళ్లారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట లో పలువురు అభిమానులకు గాయాలు కూడా అయ్యాయి. అయినా మెగాస్టార్ ను చూడాలనే అభిమానంతో వారు ఆ గాయాలను కూడా లెక్కచేయకుండా ముందుకు సాగరు.. ఈ నేపథ్యంలోనే పోలీసులకు, అభిమానులకు మధ్య కొద్దిగా వాగ్వాదం చోటుచేసుకొంది. ఇక గాయాలైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇకపోతే ఈ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా రాబోతున్నాడు. దీంతో మెగా అభిమానులందరూ.. ఒకే వేదికపై తండ్రి కొడుకులను చూడడానికి తరలివస్తున్నారు.
Read Also: Fraud Gang : ఫేక్ బ్యాంక్ గ్యారంటీలతో మోసాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు
తాజావార్తలు
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!