పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది సలార్ మూవీతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్ .. ఇక ఈ ఏడాది ప్రభాస్ కల్కి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న సినిమా విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల కారణంగా సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తుంది.. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..
ఈ సినిమాను డిఫరెంట్ కథతో తెరకెక్కిస్తున్నారు..సైన్స్, పురాణాలు కలిపి చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు డైరెక్టర్ నాగ్ అశ్విన్ఈ సినిమా గురించి వివరిస్తూ ఊరిస్తున్నాడు.. దాంతో సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ‘కల్కి 2898AD’ సినిమా విడుదల గురించి ఎన్నో వార్తలు పుట్టుకోస్తున్నాయి..
ఇదిలా ఉండగా.. సినిమా రిలీజ్ డేట్ పై ఓ వార్త వినిపిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఏపీలో జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో మే 9న రిలీజ్ కావాల్సిన ప్రభాస్ కల్కి సినిమా వాయిదా పడింది. సినిమాని 30వ తేదీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఇప్పుడు జూన్ 20 న విడుదల కాబోతుందని వార్త చక్కర్లు కొడుతుంది.. అందులో నిజమేంత ఉందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఈ సినిమా కోసం గత కొన్ని నెలలుగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ ఆ రేంజులో హైప్ ను క్రియేట్ చేశాయి.. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్‌గా కనిపించనున్నాడని, దీపికా పదుకొనే, దిశా పటాని, రానా, అమితాబ్ బచ్చన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా రాజమౌళి, దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాని అశ్వినీదత్ వైజయంతి సినిమాస్ బ్యానర్ పై తెరకేక్కుతుంది..