NTV Telugu Site icon

Kaleshwaram Commission: తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారు..

Kaleshwaram

Kaleshwaram

Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ వద్ద మాజీ సీఎస్ ఎస్కే జోషి, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ బహిరంగ విచారణ ముగిసింది. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్ట్ విచారణకు రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి హాజరయ్యారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించింది. అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సీడబ్ల్యూసీ చెప్పిందన్న ఎస్కే జోషి కమిషన్‌కు తెలిపారు. ప్రాజెక్ట్ స్థలాన్ని ఎవరు మార్చారని కమిషన్ ప్రశ్నించింది. నాటి సీఎం, మంత్రులు నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని జోషి చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీ ఏమీ లేదని జోషి పేర్కొన్నారు. సీఎం నిర్ణయమేనా మేడిగడ్డ ప్రాజెక్ట్ అని కమిషన్ ప్రశ్నించగా.. ప్రభుత్వం అని సమాధానం చెప్పిన జోషి.. ప్రభుత్వం ఎవరు అని కమిషన్ ప్రశ్న వేయగా.. సీఎం, మంత్రులు అని జోషి జవాబిచ్చారు.

Read Also: Allu Aravind: బ్రేకింగ్: శ్రీ తేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

సీఎం నిర్ణయమే ఫైనల్ కదా అని ప్రశ్నించగా.. అవునని సమాధానం ఇచ్చారు. సీఎం అన్ని నిర్ణయాలు కేబినెట్‌కు చెప్పాల్సిన అవసరం లేదని.. కేబినెట్ సీఎం కన్న పెద్దదంటూ ఆయన పేర్కొన్నారు. హైపవర్ కమిటీ గురించి తెలియదని తొలుత జోషి సమాధానం ఇవ్వగా.. తర్వాత వేరే జీవో చూపించాక అవునని ఒప్పుకున్న జోషి.. అది టెక్నికల్ కమిటీ మాత్రమేనని వెల్లడించారు. మహారాష్ట్ర వైపు ముంపు ఎక్కువుండడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కట్టారన్నారు. కాళేశ్వరం కాంప్లెక్స్ ప్రాజెక్ట్.. 28 ప్యాకేజీలు.. 8 లింకులతో కట్టారు‌ ఒక్కటే అప్రూవల్ లేదని.. వివిధ సమయాల్లో ఆయా ప్యాకేజీలకు దాదాపు 200 అనుమతులు ఇచ్చి ఉంటారన్నారు. ప్రాజెక్టుకు బడ్జెట్ ఉందా.. లేదా సప్లిమెంటరీ బడ్జెట్ ఇచ్చారా అని కమిషన్ ప్రశ్నించింది. వార్షిక బడ్జెట్‌ మాత్రమే ఉంటుంది.. అవసరాన్ని బట్టి బడ్జెట్ సప్లిమెంట్ చేస్తారని జోషి తెలిపారు.

బ్యారేజీ నిర్మాణ సంస్థలు ఇతర ఏజెన్సీల సాయమేమైనా తీసుకున్నాయా అని కమిషన్ ప్రశ్నించగా.. కాంట్రాక్ట్ సంస్థలు అవసరాన్ని బట్టి వేరే సంస్థల (సబ్ కాంట్రాక్ట్) సాయం తీసుకొని ఉండొచ్చని ఎస్కే జోషి పేర్కొన్నారు. డిజైన్ల లోపం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపం, గేట్ల ఆపరేషన్‌ల లోపం వంటి కారణాలతో మేడిగడ్డ కుంగిపోయి ఉండొచ్చని జోషి వెల్లడించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎందుకు.. ఫండ్స్ కోసమన్న జోషి.. పబ్లిక్ బాండ్స్ ఇష్యూ చేయలేదని సమాధానం.. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ప్రాజెక్ట్ నిర్మాణమని వెల్లడించారు.

Read Also: Amaravati Construction: రాజధాని నిర్మాణంపై కీలక ప్రకటన.. మూడేళ్లలో పూర్తి..!

మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణం గేట్ల ఆపరేషన్స్ సరిగ్గా లేకపోవడమేనని మాజీ ఐఏఎస్ రజత్‌కుమార్ పేర్కొన్నారు. అధికారులు ఉన్నతంగా ఆలోచన చేయాలని కాళేశ్వరం కమిషన్ చీఫ్ అన్నారు. అధికారులు తప్పులు చేస్తే ప్రజల డబ్బు వృథా అవుతుందన్నారు. మరోవైపు రజత్ కుమార్ సమాధానాలపై కమిషన్ చీఫ్ హర్షం వ్యక్తం చేశారు. 2015లో అసెంబ్లీలో కేసీఆర్ ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చి 2016లో ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారని రజత్‌కుమార్ చెప్పారు. బ్యారేజీలలో నీళ్లను ఎందుకు స్టోర్ చేశారని కమిషన్ చీఫ్ ప్రశ్నించారు మూడు బ్యారేజీలలో నీళ్లను లిఫ్ట్ చేసేంతవరకు మాత్రమే స్టోరేజ్ చేస్తున్నామని.. ఎన్నికల కోడ్ వల్ల బ్యారేజీలలో జరిగిన డ్యామేజీలను రిపేర్ చేయలేకపోయామని రజత్‌కుమార్‌ చెప్పారు. పియర్స్ కుంగిపోవడానికి కారణం ఏంటని కమిషన్ ప్రశ్నించింది.

బ్యారేజీ ఫౌండేషన్ కింద ఇసుక కొట్టుకపోవడంతో పియర్స్ కృంగిపోయాయి అనే అనుమానం ఉందని రజత్‌ కుమార్ వివరించారు. క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగింది అన్న అభిప్రాయం కూడా ఉందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ తరువాత మరమ్మతుల విషయంలో అధికారుల పాత్ర ఏంటని కమిషన్ ప్రశ్నించింది. 2019 నుంచి 2022 వరకు మూడు సంవత్సరాలు వరుసగా వరదలు వచ్చినా బ్యారేజీలు తట్టుకున్నాయని రజత్ కుమార్ తెలిపారు. మూడు సంవత్సరాలలో ఎక్కడా కూడా ఇలాంటి లోపాలు లేకుండా బ్యారేజీలు ఉన్నాయన్నారు. నిబంధనల ప్రకారమే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు జరిగాయన్నారు. బ్యారేజీ వద్ద డ్యామేజ్ జరిగితే ఫీల్డ్ లెవెల్‌లో అధికారులు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ బాధ్యత వహించాలన్నారు. ఎన్డీఎస్ఏ కామెంట్స్‌పై మాజీ ఐఏఎస్ రజత్ కుమార్‌ స్పందించలేదు. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్స్ ఆదాయం వచ్చేవరకు ప్రభుత్వమే కట్టాల్సి ఉంటుందన్నారు.