కాళేశ్వరం కమిషన్ వద్ద మాజీ సీఎస్ ఎస్కే జోషి, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ బహిరంగ విచారణ ముగిసింది. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్ట్ విచారణకు రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి హాజరయ్యారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించింది. అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సీడబ్ల్యూసీ చెప్పిందన్న ఎస్కే జోషి కమిషన్‌కు తెలిపారు.
అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించునున్నారు. షెడ్యూల్ ప్రకారం.. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10:45 గంటలకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోనున్న సీఎం.. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
నేటి నుంచి నాలుగు రోజులపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం పర్యటించనుంది.కొత్తగా నిర్మించనున్న డయాఫ్రమ్ వాల్, ఇసిఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాలపై ప్రాజెక్టు అధికారులతో కలిసి ఈ బృందం చర్చించనుంది..ముందుగా విదేశీ నిపుణులు, ఇంజినీర్లు ప్రాజె క్టును ఆమూలాగ్రం పరిశీలించనున్నారు.