Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Kakinada Firecracker Factory Blast Cm Chandrababu Jagan And Ministers Express Deep Shockkakinada Firecracker Factory Blast Cm Chandrababu Jagan And Ministers Express Deep Shock

Kakinada Firecracker Factory Blast: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. చంద్రబాబు, జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి..

Published Date :February 28, 2026 , 4:07 pm
By Sudhakar Ravula
Kakinada Firecracker Factory Blast: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. చంద్రబాబు, జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kakinada Firecracker Factory Blast: ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పేలుడు సంభవించింది.. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రమాద సమాచారం అందగానే ఆయన అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రులను సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.

ఇక, ఈ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు మృతి చెందడం తనను కలచివేసిందని, ప్రభుత్వం బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరారు. బాణసంచా కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రమాద తీవ్రత దృష్ట్యా రాష్ట్ర మంత్రులు స్పందించారు.. విజయనగరం జిల్లా పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన వేట్లపాలెం బయలుదేరారు. ఎప్పటికప్పుడు ఎస్పీ, కలెక్టర్‌లతో వివరాలు సేకరిస్తున్నారు హోం మంత్రి అనిత.. ఇక, బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేలా DME, DMHOలను ఆదేశించారు. ఘటనా స్థలానికి సూపర్ స్పెషాలిటీ వైద్యులను, అంబులెన్స్‌లను పంపారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్.. మరోవైపు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రులు నారా లోకేష్, నారాయణ.. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు.. ఏపీ బీజేపీ నేత మాధవ్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరారు.

కాగా, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ యూనిట్‌లో భారీగా ఉత్పత్తి జరుగుతోంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో 20 మంది వరకు కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు ఏడుగురు మృతి చెందినట్లు ప్రాథమికంగా ధ్రువీకరించగా, శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh fire accident updates.
  • AP CM Chandrababu Naidu
  • Home Minister Anitha
  • Kakinada fire accident
  • Samalkota blast news

తాజావార్తలు

  • Kakinada Firecracker Factory Blast: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. చంద్రబాబు, జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి..

  • Israel-Iran War: ఇజ్రాయిల్‌పై ముప్పేట దాడి.. హౌతీ-హిజ్బుల్లా-ఇరాన్ అటాక్..

  • Trump Bans Anthropic: AI ప్రపంచంలో సంచలనం సృష్టించిన ట్రంప్ .. అమెరికాలో ‘ఆంత్రోపిక్’ క్లోజ్!

  • Kakinada Fire Accident: 20 మంది సజీవ దహనం.. పేలుడు ధాటికి చెల్లాచెదురుగా మృతదేహాలు

  • Geethu Royal: తిరుమలలో గీతూ ఓవరాక్షన్.. జీవితం కోల్పోయానంటూ రీల్!

ట్రెండింగ్‌

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • Ragi Barfi Recipe: రుచితో పాటు పోషకాలు.. హోమ్‌ మేడ్ ‘రాగి బర్ఫీ’ ఎలా చేయాలంటే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions