Kakinada Collector: చిన్నారులపై అకృత్యాలు.. కంటతడి పెట్టుకున్న కాకినాడ కలెక్టర్ షన్మోహన్
- కంట తడి పెట్టుకున్న కాకినాడ కలెక్టర్ షన్మోహన్
- బాలల హక్కుల వారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
- చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలపై మాట్లాడుతూ ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ షన్మోహన్ కంట తడి పెట్టుకున్నారు. బాలల హక్కుల వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలపై మాట్లాడుతూ కలెక్టర్ షన్మోహన్ ఎమోషనల్ అయ్యారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడం వల్లే కలెక్టర్ అయ్యానని భావోద్వేగానికి గురయ్యారు. కాకినాడలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌ను ఉద్దేశించి కలెక్టర్ వ్యాఖ్యానించారు. బాలలను లైంగికంగా వేధించే వారిని మరొక దేశంలో ఉరి వేస్తారని.. పోక్సో కింద కేసు నమోదు అయిన టీచర్‌ను తాను కొట్టలేను కనుక కొట్టలేదన్నారు. ఆఫీసర్‌ని పెట్టి అక్కడే ఉరి వేయాలన్నారు. ఆ టీచర్ ఇంట్లో కూడా అదే వయస్సు పిల్లలు ఉన్నారు..ఆయనకు అదేం ఖర్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Anil Kumar Yadav: పార్టీ మారుతున్నారనే వార్తలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ!
Also Read
- OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
- NALSAR Row: నల్సార్ వివాదం.. లా స్టూడెంట్స్‌కు BCI చీఫ్ మనన్ మిశ్రా క్షమాపణ..
- CM Yogi: ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’.. కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
- Gen Z Lifestyle: 'జెన్ జీ' లైఫ్‌స్టైల్ వెనుక అసలు నిజం.. టూర్లు కావు.. 70% డబ్బు దేనికి పోతోందో తెలుసా..?
అలాంటి కీచక టీచర్లను ఫ్యామిలీలో తలెత్తుకోకుండా చేయాలన్నారు. కీచక టీచర్లు అని తెలిసి మిగిలిన టీచర్లు మనకెందుకులే అని వదిలేస్తున్నారన్నారు. అలా చేస్తే వారు చదువు చెప్పే పిల్లల జీవితాలను చేతులారా నాశనం చేసుకున్నవాళ్ళవుతారని అన్నారు. ఏ టీచరైనా విద్యార్ధులను లైంగికంగా వేధిస్తే ఫోక్సోతో పాటుగా వేరే కేసు పెట్టి లోపలేయిస్తానని హెచ్చరించారు. బదిలీల సమయంలో కొందరు టీచర్లు వారి ఇంటి నుండి 10 కి.మీ దూరంలో ఉన్న స్కూల్ కోసం ఎమ్మెల్యే, ఎంపీ సిఫార్స్ లేఖలు తీసుకుని వస్తున్నారని.. నాకు సిగ్గుగా అనిపిస్తుందన్నారు. విద్యార్థులను అలాంటి టీచర్లు మోసం చేసినట్లేనని కలెక్టర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
-
OTR: జడ్చర్ల రాజకీయాల్లో రచ్చ.. ఈ పబ్లిసిటీ స్టంట్ వెనుక ఎవరున్నారు..?
-
Meghamsh Srihari: నాన్నగారిలాగే నన్నూ ఆశీర్వదించండి
-
NALSAR Row: నల్సార్ వివాదం.. లా స్టూడెంట్స్‌కు BCI చీఫ్ మనన్ మిశ్రా క్షమాపణ..
-
Aasmaan : గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!