టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి అందరికీ తెలుసు.. మొదటి సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ సినిమా తర్వాత కేరీర్ దూసుకుపోతుందని అందరు అనుకున్నారు.. కానీ రెండు, మూడు సినిమాల తర్వాత పెద్దగా హిట్ సినిమాలు లేవు.. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయి అనుకోకుండా హీరో అయి సక్సెస్ కొట్టాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత ఎక్కువగా ప్లాప్ సినిమాలే పలకరించాయి..
ఇక ఈ ఏడాది సంక్రాంతికి నాగార్జున ‘నా సామి రంగ’ సినిమాలో ఓ క్యారెక్టర్ పోషించాడు.. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు తిరగబడరా సామీ, భలే ఉన్నాడే, పురుషోత్తముడు సినిమాలతో రాబోతున్నాడు.. అయితే రాజ్ తరుణ్ పెళ్లి గురించి ఒకప్పుడు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.. కానీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న హీరో పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.
రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ఏది ఏమైనా సరే జీవితంలో పెళ్లి మాత్రం చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యాను. నాకు పెళ్లి, పిల్లలు వద్దు. నేను సింగిల్ గా హ్యాపీగా ఉన్నాను. పెళ్లి విషయంలో మా నాన్న నా ఇష్టం అంటారు. అమ్మ మాత్రం మొదట్లో అడిగేది, ఇప్పుడు నా ఇష్టం అని వదిలేసింది అని చెప్పాడు.. అయితే ఇప్పటిలో పెళ్లి గురించి ఆలోచనలేదు అని తేల్చి చెప్పేసాడు.. ప్రస్తుతం రాజ్ తరుణ్ వయస్సు 31 ఏళ్లు.. మరి ఫ్యూచర్లో పెళ్లి పై మనసు మార్చుకుంటాడేమో చూడాలి..