మాజీ మంత్రి సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. అని, గత ఎన్నికల్లో ఎన్నికల అధికారి పెట్టిన కేసులో నా పేరు ఉందని సోమిరెడ్డి నిరూపించగలరా..? అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ పాలనలో కేసులు నమోదు చేసారా.. లేక టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదైందా.. ..చెప్పే దమ్ము సోమిరెడ్డికి ఉందా అని ఆయన అన్నారు. మద్యం దొరికిన రైస్ మిల్ ఓనర్ కు, నాకు సంబంధం ఉందని నిరూపిస్తావా.. అని ఆయన వ్యాఖ్యానించారు.
ఓటమిని ముందుగానే అంగీకరించిన సోమిరెడ్డి నోటికొచ్చినట్లు అబద్దాలు చెబుతున్నాడని, పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు 5 వేల మంది వచ్చారని నిరూపిస్తే నా నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా అని ఆయన అన్నారు. సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయం.. ఓటర్లకి డబ్బులు పంచుతున్న సోమిరెడ్డిని డీస్ క్వాలిఫై చెయ్యమని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశా అని ఆయన అన్నారు. సోమిరెడ్డి సంస్కారంగా బతకడం నేర్చుకోవాలన్నారు. ఎక్కడో మద్యం దొరికితే దాన్ని నాకు ఆపాదిస్తారా అని, మా ఎలక్షన్ కూడా సోమిరెడ్డే చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. నేను ఏం మాట్లాడాలో కూడా ఆయనే చెబుతున్నాడు అని ఆయన విమర్శించారు.